విశిష్ట వ్యకిత్వం – ఉన్నత ప్రమాణాలు – గొప్ప విజయాలు వెరసి జితేందర్ ఐ.పి.ఎస్.
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బి.సి.దళ్ అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ.జితేందర్ IPS (లా&ఆర్డర్) గారిని మర్యాదపూర్వకముగా కలుసుకొని దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ బి.సి.దళ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి. పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఉన్నత చదువులు చదివి ఐ.పి.ఎఎస్ సాధించి 1992సం. బ్యాచ్ తెలంగాణ కేడర్ కు ఎంపిక అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అడిషనల్ ఎస్.పి. గా మొదట భాద్యతలు స్వీకరించిన జితేందర్, తదుపరి బెల్లంపల్లి లో ఎ.ఎస్.పి.గా పని చేసారు. ఈ రెండు ప్రాంతాలు అప్పట్లో తీవ్రమైన నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడం మరియు మహారాష్ట్ర బోర్డర్ లో ఉండడం వల్ల వారిని అదుపు చెయ్యడం ఒక పెద్ద సవాలుగా తీసుకోని వారిని నిలువరించడంలో కృతకృత్యులు అయ్యారు. ఆ తదుపరి మహబూబ్ నగర్ లో ఎస్.పి. గా పనిచేసారు. పాలమూరు జిల్లా కుడా అప్పట్లో వివిధ సాయుధ దళాలకు అడ్డగా ఉండేది మరియు నల్లమల అడవులు నక్సల్స్ కు పట్టున్న ప్రాంతాలుగా షెల్టర్ జోన్ లుగా ఉండడంతో ఈ ప్రాంతంలో విధులు నిర్వహించడం అంటే పోలీసులకు కత్తి మీద సాము లా ఉండేది. కాని ప్రజల భాగస్వామ్యంతో ఒక పకడ్బంది నెట్వర్క్ ఏర్పరుచుకొని హద్దుమీరిన నక్సల్స్ ను తమదైన శైలిలో ఏరివేయ్యడమో లేదా వారిని జనజీవన స్రవంతిలో కలపడమో చేసారు. నల్లమలలో మరియు పాలమూరు ప్రాంతంలో నక్సల్ సామ్రాజ్యాన్ని దాదాపు నిర్మూలించి ఇక్కడ శాంతి నెలకొల్పడంలో విజయం సాధించారు. తర్వాత గుంటూరు జిల్లా ఎస్.పి. గాను, గ్రేహౌండ్స్ లో, సి.బి.ఐ.లో, సి.ఐ.డి. విభాగంలో, విజిలెన్సు విభాగంలో, చివరిగా హైదరాబాద్ మహానగర అత్యంత కీలకమైన ట్రాఫిక్ విభాగంలో పని చేసారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కుడా వరంగల్ రీజనల్ లో లా&ఆర్డర్ దెబ్బతినకుండా, ఉద్యమకారులపై కాల్పులు జరుపకుండా ఎంతో సమర్ధంగా వ్యవహరించారు. భాగ్యనగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను వివిధ విభాగాల సమన్వయంతో చాలావరకు పరిష్కరించ గలిగారు. గడచిన పదిహేను సంవత్సరాలుగా వాహనాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగినా కుడా వాహనాల కదలిక వేగంను గంటకు 5కి.మీ. నుండి ఇప్పుడు కనీసం గంటకు 20కి.మీ. సాధించడంలో వీరి కృషి ఎంతో ఉంది. అంతే కాకుండా వాహనదారుల నుండి చలానా బుక్కుల ద్వారా చలనాలు వసూలు చేసే ట్రాఫిక్ విభాగాన్ని అత్యంత అవినీతి పరులుగా భావించే పద్దతిని పూర్తిగా మార్చాలని సంకల్పించిన జితేందర్ గారు ఈ మాన్యువల్ సిస్టం ను ప్రక్షాళన చేసి ప్రస్తుతం వాహనదారుల ఆమోదం పొంది అవలంభిస్తున్న “ఆన్లైన్ చలాన్ సిస్టం” ను రూపొందించి గొప్ప విజయం సాధించారు. తన హయాంలో డంక్ అండ్ డ్రైవ్, సిటి లో ఆక్సిడెంట్ కేసులు, సిగ్నల్ జంప్ కేసులు చాలా తగ్గుముఖం పట్టాయి. అంతే కాకుండా వాహనచోదకులకు, పాదాచారులకు పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర దేశాల ట్రాఫిక్ విభాగాలను అధ్యయనం చేసి ఉత్తమమైన ట్రాఫిక్ సిస్టం ను రుపొందిచే విషయంలో జితేందర్ గారు ఎంతో కృషి చేసారు. అంతే కాకుండా ట్రాఫిక్ విభాగంలో ఐ.టి.ఎం.ఎస్. (ఇంటలిజెంట్ ట్రాఫిక్ మానేజ్మెంటు సిస్టం) వంటి అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన ఫలితాలను సాధించడంలో అనేక ప్రణాళికలు రూపొందించారు.
జె.ఎన్.యూ నుండి ఎం.ఫిల్ చేసిన సమయంలో తనను ప్రోత్సహించి ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలు నేర్పి తనను గొప్ప మానవతావాదిగా తీర్చి దిద్దిన వారి గురువు ప్రొఫెసర్ హబిబుల్లా గారంటే జితేందర్ గారికి అమితమైన అభిమానం. వారి గురువుగారి ఉపదేశాన్ని తూ.చా. తప్పకుండా నడుచుకునే జితేందర్ గారు తన ఉద్యోగధర్మం సక్రమంగా పాటిస్తూనే సహోద్యోగులతో మర్యాదపూర్వకముగా మసులుకుంటూ, ప్రభుత్వ అధికారులు, పాలకులు మరియు ప్రజలతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఏర్పరుచుకొని అందరి సహకారం సమిష్టి కృషి ద్వారానే ఉత్తమ ఫలితాలుంటాయని నమ్మి ఆచరణలో అనేక విజయాలను సాధించి చూపించారు. శ్రీ.జితేందర్ ఐ.పి.ఎస్ గారు రాబోయే రోజులలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి తెలంగాణ సమాజానికి తమ నిస్వార్ధ సేవలు అందించాలని ఆశిద్దాం.